- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ ఎన్నికల వేళ మారుతున్న కండువాలు.. అధికార పార్టీలో జోరుగా చేరికలు
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ కోలాహలం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు పార్టీల మద్దతుతోనే బరిలో ఉన్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలు, యువతను తమ తమ పార్టీల్లోకి లాక్కుంటున్నారు. ఆయా పార్టీల్లో చేరేవారితో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ లాభం ఉంటుందని చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీల్లో చేరికల సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సైలెంట్‌గానే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ వస్తారులే అని వదిలేస్తున్నట్టుగా తెలుస్తున్నది. కానీ కాంగ్రెస్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి భారీగా చేర్చుకుంటున్నది. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనవైనప్పటికీ అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తున్నారు.






