- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేదిక ఖరారు.. కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన అక్కడినుంచే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రెండ్రోజుల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా కలిసొచ్చిన కరీంనగర్ వేదికగా జాతీయ పార్టీ ప్రచార పర్యటన

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రెండ్రోజుల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా కలిసొచ్చిన కరీంనగర్ వేదికగా జాతీయ పార్టీ ప్రచార పర్యటనను ప్రారంభిస్తారని అందరూ భావించిన తరుణంలో గులాబీ బాస్ అనూహ్యంగా వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీ పరిచయం చేయాల్సిన అవసరం ఉండటంతో మహారాష్ట్ర నుంచి దేశవ్యాప్త పర్యటనను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న పార్టీ ప్రకటన అనంతరం, పర్యటన వివరాలు కూడా కేసీఆర్ వెల్లడించే చాన్సులున్నట్లు సమాచారం. కాగా, విజయదశమి రోజున ముందుగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
Also Read: ముఖ్యమంత్రి పదవి కోల్పోనున్న కేసీఆర్.. జాతీయ పార్టీతో కొత్త చిక్కులు!






