- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ వద్దకు చేరిన ఎమ్మెల్యేల జాబితా.. అలర్టయిన విప్‌లు
ప్రభుత్వ విప్‌ల పనితీరులో మార్పు కనిపిస్తున్నది. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విప్‌ల పనితీరులో మార్పు కనిపిస్తున్నది. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. అందుకోసం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మెసేజ్‌లు పంపుతున్నారు. సభా ప్రారంభానికి పావుగంట ముందే అసెంబ్లీలో ఉండాలని కోరుతున్నారు. మళ్లీ తెల్లారి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరికి ఫోన్ చేసి సభకు రావాలని సూచిస్తున్నారు. దీనితో సభకు సభ్యుల హాజరుపెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో విప్‌ల పనితీరు సరిగా లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనితో అలర్టయిన విప్‌లు విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సభా వాయిదా పడిన మరుక్షణమే మీడియా పాయింట్‌కు వెళ్లి మాట్లాడుతున్నారు. సభలో సభ్యుల హాజరు పెంచేందుకు ఫోకస్ పెడుతున్నారు.
ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేల జాబితా సీఎంకు
ప్రస్తుతం నలుగురు ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. వీరంతా సభ్యుల హాజరుపై దృష్టి పెడుతున్నారు. అయినా కొందరు సభ్యులు ఆలస్యంగా వస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చేందుకు సీఎం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల తర్వాత అసెంబ్లీకి చేరుకున్నారు. అయినా కొంత మంది కాంగ్రెస్ సభ్యులు ఇంకా సభకు రాలేదు. ఆలస్యంగా వచ్చిన సభ్యుల వివరాలను సీఎంకు విప్‌లు అందించినట్టు తెలుస్తున్నది.






