టీజీ పీజీఈసెట్ 2026 పరీక్షల షెడ్యూల్ లో మార్పు

by velandi.Saikiran |   (  Updated:2026-05-19 15:48:24  IST  )

బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న జరగాల్సిన టిజి పీజీఈసెట్-2026 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

టీజీ పీజీఈసెట్ 2026 పరీక్షల షెడ్యూల్ లో మార్పు
X

టీజీ పీజీఈసెట్ 2026 పరీక్షల షెడ్యూల్ లో మార్పు

మే 28న పరీక్ష జూన్ 1 కి వాయిదా

మే 22 నుండి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ కు అవకాశం

దిశ, తెలంగాణ బ్యూరో: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న జరగాల్సిన టిజి పీజీఈసెట్-2026 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మే 28న జరగాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన మే 29, 30, 31 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మునుపటి షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతాయి.

మే 22 నుంచి హాల్ టిక్కెట్లు

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22 న ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్ www.pgecet.tgche.ac.in ద్వారా తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Next Story