చలి ఎఫెక్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్పు

by Muthe.Rajitha |

తెలంగాణను ముఖ్యంగా ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోన్న సంగతి తెలిసిందే.

చలి ఎఫెక్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్పు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణను ముఖ్యంగా ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోతున్న క్రమంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాఠశాలల పనివేళలను మార్చారు. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, చలిగాలుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున వారి ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని, ఇకపై ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అమలు చేయనున్నారు. ఈ మార్పులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐఎండీ నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, నిబంధనలు పాటించకుండా ముందుగానే పాఠశాలలు ప్రారంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ హెచ్చరించారు.

Next Story