టీ- పాలిటిక్స్‌లోకి మరోసారి Chandrababu ఎంట్రీ.. ఉత్కంఠ రేపుతోన్న Telangana టూర్..!

by Disha Web Desk 19 |
టీ- పాలిటిక్స్‌లోకి మరోసారి Chandrababu  ఎంట్రీ.. ఉత్కంఠ రేపుతోన్న Telangana టూర్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై గత కొంత కాలంగా కసరత్తు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టూర్ ఖరారు అయింది. డిసెంబర్ 21న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు తెలంగాణలో టీడీపీ యాక్షన్ ప్లాన్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. టీడీపీ కంచుకోట ఖమ్మం నుంచి టీడీపీ జైత్రయాత్ర ప్రారంభించబోతున్నామని కాసాని చెప్పారు. ఖమ్మం సభకు చంద్రబాబు హాజరు అవుతారని, ఈ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించబోతున్నామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలోని గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఎంట్రీతో ఆసక్తిగా రాజకీయం:

గత కొంత కాలంగా తెలంగాణపై దృష్టి సారించిన చంద్రబాబు నాయుడు ఆ మేరకు పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు ఆలోచనలు తెలంగాణ రాజకీయంలో వేడి పుట్టిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు తాజాగా 2023 ఎన్నికల్లో మరోసారి యాక్టివ్ కావాలని, తద్వారా పార్టీని మరింత ప్రోత్సహించాలని నిర్ణయిచుకున్నారు. ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సమయంలో భద్రాచలంలో పర్యటించి అందరిని ఆశ్చర్యపరిచిన చంద్రబాబు.. ఆ సందర్భంలో కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నట్టు కన్ఫార్మ్ చేశారు. ఆ మేరకు పార్టీ కసరత్తు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

ఎవరికి నష్టం ఎవరికి లాభం:

రాష్ట్ర విభజన అనంతరం పార్టీ ప్రభాల్యం క్రమంగా తగ్గుతూ వస్తున్న టీడీపీ తాజాగా తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాలో అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ గడ్డపై ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ భావిస్తుంటే.. ఈ సారి ఛాన్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాచుకు కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సైకిల్ గుర్తు పార్టీ స్పీడు పెంచితే ఏ మేరకు ఎఫెక్టు ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

తాజాగా కాసాని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా నుంచి మొదలు కాబోతున్న తమ పోరాటం ఎన్నికల వరకు ప్రజల్లో ఉండేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నామని బస్సు యాత్రలకు తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో ఎన్నికల సమయాన్ని పార్టీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోగలిగినా, మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఆ ఎఫెక్ట్ వల్ల ఎవరికి లాభం మరెవరికి నష్టం తెచ్చిపెడుతుందనే చర్చ తెరపైకి వస్తోంది. గత అనుభవాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు చంద్రబాబు అంగీకరించరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కేసీఆర్‌కు డ్యామేజ్ చేస్తాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Read more:

'కేసీఆర్ అబద్ధాల పుట్టా.. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి'


Next Story

Most Viewed