Davos: ఒకే వేదికపై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు.. దావోస్ లో మరో ఆసక్తికర పరిణామం

by Prasad Jukanti |

దావోస్ లో సీఎం పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Davos: ఒకే వేదికపై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు.. దావోస్ లో మరో ఆసక్తికర పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఒక వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ (Country Strategic Dialogue) సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఈ మూడు రాష్ట్రాల సీఎంలు పాల్గొని దేశ సమగ్రాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. ఈ ముగ్గురిలో రేవంత్ రెడ్డి ఇండియా కూటమికి చెందిన సీఎం కాగా చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. కాగా రెండు రోజుల క్రితం దావోస్ కు వెళ్లేందుకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే.

Next Story