ఫార్ములా ఈ కార్ రేస్ కేసును డైవర్ట్ చేయడానికే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు: చనగాని దయాకర్

by Malleboina Mahesh |

తన పైన వచ్చిన అవినీతి కేసును డైవర్ట్ చేయడానికి సీఎం పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో అనకొండ లాగా తెలంగాణ భూములను అన్యాక్రాంతం కాగా, హైడ్రాతో తమ ప్రభుత్యం భూములను కాపాడుతోందని టీపీసీసీ జెన్రల్ సెక్రటరీ, చనగాని దయాకర్ తెలిపారు.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసును డైవర్ట్ చేయడానికే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు: చనగాని దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తన పైన వచ్చిన అవినీతి కేసును డైవర్ట్ చేయడానికి సీఎం పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో అనకొండ లాగా తెలంగాణ భూములను అన్యాక్రాంతం కాగా, హైడ్రాతో తమ ప్రభుత్యం భూములను కాపాడుతోందని టీపీసీసీ జెన్రల్ సెక్రటరీ, చనగాని దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడి గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, కేటీఆర్ అవినీతి ఏంటో ఆయన సొంత చెల్లినే మాట్లాడుతున్నారని, కవిత చేసి విమర్శలుపై కేటీఆర్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం మీడియాతో చనగాని దయాకర్ మాట్లాడుతూ కేటీఆర్ అవినీతికి సాక్ష్యంగా హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ వెయ్యి కోట్లతో ఏసీబీ దాడుల్లో దొరికారని, హైదరాబాద్ చుట్టూ పక్కల కోకాపేట, బాచుపల్లి, ఉప్పల్ భాగాయత్, పటాన్ చెరు ఏరియాల్లో రియల్టర్ లతో కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. సీఎంపై కేటీఆర్ చిల్లర ఆరోపణలు మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడంతో తెలంగాణ అభివృద్ధిలో పురోగతి సాధించిందని దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లలో హెచ్ఎండీఏ, టీజీఐసీసీ భూములతో పాటు దాదాపు వెయ్యి ఎకరాలు అప్పనంగా కేటీఆర్ అమ్మారని, 30 వేల కోట్ల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

Next Story