- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Osmania University Issue : కేటీఆర్ కు చనగాని దయాకర్ సవాల్
టీపీసీసీ(TPCC) అధికార ప్రతినిధి చనగాని దయాకర్(Chanagani Dayakar) బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ(TPCC) అధికార ప్రతినిధి చనగని దయాకర్(Chanagani Dayakar) బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్ లో మీడియా సంవేశం నిర్వహించిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఓయూలో కొన్ని నియమాలు విధించారని అన్నారు. దీనిని బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders), ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు సవాల్ విసురుతున్నానని.. పదేళ్ళ పాలన కాలంలో ఎన్నిసార్లు ఓయూకు వచ్చారో తెలుపాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సీటలకు వెళ్ళడానికి ఉన్న సమయం ఓయూను సందర్శించడానికి గులాబీ పార్టీ నాయకులకు ఎందుకు లేదని ప్రశ్నించారు.
పదేళ్ళ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావుల పుట్టిన రోజులు జరపడానికి మాత్రమే వాడారని, యూనివర్సిటీకి వారు చేసిందేమీ లేదని మండిపడ్డారు. గత పాలనలో విద్యార్థులు ఏదైనా అడిగితే కేసులు పెట్టారని. రాహుల్ గాంధీ ఓయూలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఓయూలో విద్యార్థుల హక్కులను, వారి సంరక్షణను కాంగ్రెస్ కంటిరెప్పలా కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఓయూను వారి గుప్పెట్లో పెట్టుకున్న కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.






