New Ministers: అడ్లూరికి ఫస్ట్.. వివేక్, వాకిటికి సెకండ్ ఫ్లోర్.. కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు

by Prasad Jukanti |

కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయించారు.

New Ministers: అడ్లూరికి ఫస్ట్.. వివేక్, వాకిటికి సెకండ్ ఫ్లోర్.. కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సెక్రటేరియట్ లో (Telangana Secretariat) చాంబర్లు (Chambers Allotment) కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు (Adluri Laxman) ఫస్ట్ ఫ్లోర్ లో 13, 14, 15, 16 నంబర్ రూంలు, మంత్రి వివేక్ వెంకటస్వామికి (Vivek Venkata Swamy) సెకండ్ ఫోర్ లో 20, 21, 22 నంబర్ రూంలు, మంత్రి వాకిటి శ్రీహరికి (Vakiti Srihari) సెకండ్ ఫ్లోర్ లో 26, 27, 28 నంబర్ రూంలు కేటాయించారు. చాంబర్లు కేటాయించడంతో త్వరలోనే వీరు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖలు కేటాయించగా వివేక్ వెంకట స్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖలు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.

Next Story