- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chamala: పత్తి రైతుల బాధలు పట్టించుకోండి.. కేంద్రమంత్రికి చామల కిరణ్ లేఖ
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా(సీపీఐ) పత్తి రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా(సీపీఐ) పత్తి రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో చాలా మంది రైతులు ఆవేదనతో ఉన్నారని ఆయన మంగళవారం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. రైతుల పండించిన పత్తి పంటను 4 గ్రేడ్‌ల ఆధారంగా తప్పనిసరిగా సేకరించాలని, మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత సీసీఐపై ఉంటుందన్నారు. సీపీఐ అభ్యంతరాలు పెట్టడం వలన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. నాణ్యమైన సరఫరా విధానం అంటూ పేద చిన్న, సన్నకారు రైతులలో ఆందోళన కలిగిస్తుందన్నారు. పత్తి క్వాలిటీ విత్తనాలపై ఆధారపడి ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని కోరారు. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన సమయంలో పత్తి రైతులు పడ్తున్న ఇబ్బందులు, అన్యాయంపై కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి ,సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఎంపీ వివరించారు.






