- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chamala: కేంద్రమంత్రులకు ఎంపీ చామల కిరణ్ సంచలన లేఖ
ఢిల్లీ(Delhi)లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కేంద్రమంత్రులను(Union Ministers) కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi)లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కేంద్రమంత్రులను(Union Ministers) కలిశారు. ఈ సందర్భంగా పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని కోరారు. ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivaraj Singh Chuhan), కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh) లను వారి కార్యాలయాలలో కలిశారు.
తెలంగాణలో రైతులు పత్తిపంటను ఎక్కువగా పండిస్తుంటానని, కానీ పత్తిని విక్రయించే సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పత్తి రైతుల సమస్యలను(Cotton Farmers Problems) లేఖ(Letter) ద్వారా తెలియజేశారు. ఈ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తి, చర్చకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. అంతేగాక ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కేంద్రమంత్రులను ఎంపీ చామల కోరారు.






