Chamala: రేవంత్ ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారు: చామల

by Prasad Jukanti |   (  Updated:2026-01-04 10:49:12  IST  )

కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్ ఇచ్చారు.

Chamala: రేవంత్ ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారు: చామల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్ మంచినే కోరుకుంటారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పరామర్శించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వాస్తవాలు వివరించారని, నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని దుయ్యబట్టారు. కాగా నిన్న అసెంబ్లీలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో విర్రవీగుతున్నాడని పదే పదే చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి గురించి, ఒక రాబందు మాదిరిగా రైతుబంధు కేసీఆర్ గురించి అనరాని మాటలు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా చామల కౌంటర్ ఇచ్చారు.

Next Story