‘డ్రామా క్వీన్.. లిక్కర్ క్వీన్ కవిత కాంగ్రెస్ చరిత్ర తెలుసుకో’: Chamala Kiran Kumar Reddy

by Disha Web Desk 19 |
‘డ్రామా క్వీన్.. లిక్కర్ క్వీన్ కవిత కాంగ్రెస్ చరిత్ర తెలుసుకో’: Chamala Kiran Kumar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘డ్రామా క్వీన్.. లిక్కర్ క్వీన్ కవిత చరిత్ర తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ప్రజలకు తెలుసు. నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు” అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్​కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. కేటీఆర్ తరహాలో ట్వీట్లు చేస్తే.. జనాలు నమ్ముతారనే భ్రమలో ఉండొద్దన్నారు. కాంగ్రెస్ చేసిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలన్నీ అందరికి తెలుసు అన్నారు.

అవగాహన లేకుండా ట్విట్లతో తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేశామన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీపై బీఆర్ఎస్ ఒత్తిడి చేయలేకపోయిందన్నారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. లిక్కర్ స్కామ్​నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశావన్నారు. లిక్కర్ స్కామ్ మచ్చ తుడిచే ప్రయత్నం చేసుకుంటున్నారన్నారు.

మహిళలపై అంత ప్రేమ ఉంటే ఫస్ట్ కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. టిక్కెట్లలో కేవలం7 మాత్రమే ఇవ్వడమేందీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ ముందు ధర్నా చేస్తామని, కవిత కూడా రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. 2014 నుంచి ఒక్కమహిళా మంత్రి లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.


Next Story

Most Viewed