- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సంవత్సరం తొలి రోజే కేటీఆర్ గోబెల్స్ ప్రచారం: ఎంపీ చామల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని, హరీష్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలనపైన విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని, హరీష్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలనపైన విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మీ బావ హరీష్ రావు కృష్ణా.. గోదావరి నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుంటే, కేటీఆర్ రైతులకు యూరియా సరఫరాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు భూ స్థాపితం చేశారు..లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని 8 సీట్లలో గెలిపించి గుండు సున్నా తెచ్చుకుంది..రైతులకు యూరియా కోసం ధర్నాలు చేశాం..నడ్డాతో మాట్లాడి యూరియా తెప్పించామని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024-2025 సంవత్సరానికి వానాకాలం పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి తెప్పించామని, యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకువచ్చామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ స్థాయిలో ఎప్పుడూ యూరియా తేలేదని, 2025-2026 వానాకాలం పంటకు 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చినట్లుగా కిరణ్కుమార్ రెడ్డి చెప్పారు. యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్ కాలేదని, కేటీఆర్ తప్పుడు సమాచారంతో, తప్పుడు మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన హితవు పలికారు.






