- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chamala: మీ దోపిడి 70 ఎంఎంలో చూపిస్తాం.. బీఆర్ఎస్ పై ఎంపీ చామల విమర్శలు
బీఆర్ఎస్ పై ఎంపీ చామల విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు తమ దోపిడిని మర్చిపోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మళ్లీ తెరమీదకు తెలంగాణ సెంటిమెంట్ ను తీసుకువస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మధ్య బనకచర్ల విషయంలో ఏదో లింక్ పెట్టి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కోరుతున్నట్లు అసెంబ్లీలో కెమెరాలన్నీ మీ వైపే ఉంచుతామని అయితే అబద్ధాలు చెప్పొద్దని షరతు విధిస్తున్నానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు దివాళా తీసిందో శాఖల వారీగా చర్చకు సిద్ధం అన్నారు. మీ 10 ఏళ్ల పాలనకు, మా 18 నెలల పాలకు తేడాను న్యాయనిర్ణేతలేనన్నారు. అసెంబ్లీ వాయిదా మేమేస్తామో మీరే వేయిస్తారో ప్రజలు చూస్తారన్నారు. అసెంబ్లీకి చర్చకు రావాలని పిలుస్తుంటే చర్చకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారని మండిపడ్డారు.
దోపిడిని 70 ఎంఎంలో చూపిస్తాం:
నీటి వాటాల విషయంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) నాయకులు ఏ గాడిద పళ్లు తోమారని దుయ్యబట్టారు. తెలంగాణలో అనేక మంది తెలివైన ఉన్నవాళ్లు ఉన్నా వారికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్, హరీశ్ రావు మాత్రమే ఇరిగేషన్ శాఖకు మంత్రులుగా పని చేశారన్నారు. కృష్ణా నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరు అని నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాను అనుభవించిన కేసీఆర్ ప్రజల తీర్పును అంగీకరించి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలి కదా అని నిలదీశారు. కేసీఆర్ కు ఓపిక లేకపోతే ఎల్పీ హోదాను మిగతా వారికి ఇవ్వొచ్చుకదా అని ప్రశ్నించారు. తన కొడుకుకో అల్లుడికో ఆ అవకాశం ఇచ్చి వారికి ఇంత ప్రవర్తన కూడా నేర్పాలన్నారు. మంత్రులు, సీఎంను, దళిత స్పీకర్ ను అవహేళన చేసి అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసి అసెంబ్లీ బయటకు వచ్చి గగ్గోలు చేస్తున్నారన్నారు. మీపదేళ్ల దోపిడిని 70 ఎంఎంలో చూపిస్తాం అసెంబ్లీకి రావాలన్నారు.






