- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్లు ఎలా దోచుకున్నారో కవిత ఆ పార్టీ పైన విచారణ కోరాలి
సామాజిక న్యాయం కోసమా నీ పోరాటం, పార్టీలో సముచిత స్థానం లేదని పోరాటామా, లేదా దోచుకున్న సొమ్ములో నీ వాటా రాలేదని నీ ఆవేదనన, పదేళ్లలో మీ ప్రభుత్వం దోచుకున్నదని బంగారు తెలంగాణ రాలేదని నీ అవేదన అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ప్రశ్నించారు.

- మీతో ఎంపీగా నేను వస్తాను.. సీబీఐ విచారణ కోరుదాం
- అప్పుడు కవితపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా..? లేక సేల్ హా..?
- ఇద్దరు ఒకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక న్యాయం కోసమా నీ పోరాటం, పార్టీలో సముచిత స్థానం లేదని పోరాటామా, లేదా దోచుకున్న సొమ్ములో నీ వాటా రాలేదని నీ ఆవేదనన, పదేళ్లలో మీ ప్రభుత్వం దోచుకున్నదని బంగారు తెలంగాణ రాలేదని నీ అవేదన అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. గాంధీభవన్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిఖని సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరగటం లేదని కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉన్నారు. రోజుకో పాట, రోజుకో మాట చెప్పుకుంటూ పోతే ఎటూ కాకుండా పోతారని ఆమెను ఉద్దేశించి మాట్లాడారు. మీ కుటుంబ సమస్యను తెలంగాణ ప్రజలపై రుద్దకండి అని హితువు పలికారు. పదేళ్లు ఎలా దోచుకున్నారో కవిత బీఆర్ ఎస్ పార్టీ పైన విచారణ కోరాలని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపిగా మీ తో నేను వస్తానని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుదాం అని అన్నారు. అప్పడు కవితపై ప్రజలకు నమ్మకం ఏర్పడుందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యాలు కవిత వ్యాఖ్యాలకు సమర్ధనీయంగా ఉన్నయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఓర్వలేక ఇటువంటీ పనులకు పూనుకున్నారని ఆరోపించారు. ఎంపి ఎన్నికల సమయంలో బీజేపీ పోటీ చేసిన చోట్ల డమ్మి కాండిడేట్లను పెట్టారని ఓట్లు బదిలీ చేశారని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యాలు బీఆర్ఎస్ బీజేపి దోస్తానాకు అద్దం పడుతున్నాయని తెటతెల్లం అయిందని అన్నారు. ఒక్క ఎంపి సీట్ కూడా బీఆర్ఎస్ కు రాదా అని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా లేక సేల్ ఆఫర్ పెట్టారా అని అన్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు ఆర్ధిక సంక్షోభం ఉందని తెలిపారు. ఈ సమయంలో విమానం కొనేందుకు కమిటీ వేశారని అబద్ధపు ప్రచారాలు బీఆర్ఎస్ పని గట్టుకుని చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్ల నుంచి విమానం కొనిస్తే తీసుకుంటామని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అడ్డం పడకుండా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంతో ముందుకు రావాలని అన్నారు. బీజేపీ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాజాసింగ్ చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.






