‘నీకు అంత సీన్ లేదు.. నువ్వొక ఫెయిల్డ్ ఎనలిస్టువి’: ప్రశాంత్‌ కిషోర్‌కు MP చామల కౌంటర్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

‘నీకు అంత సీన్ లేదు.. నువ్వొక ఫెయిల్డ్ ఎనలిస్టువి’: ప్రశాంత్‌ కిషోర్‌కు MP చామల కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మీద సంచలన ఆరోపణలు చేశారు. బిహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తానని పీకే సవాల్ విసిరారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోఢీ కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్పందించారు.

‘ప్రశాంత్ కిషోర్ దేశం మొత్తంలో తనకంటే తెలివైన వ్యక్తి ఎవరూ లేరనే భావనలో ఉన్నాడు. అందరికంటే నేనే గొప్పవాడినని.. ఎవరినైనా పీకేస్తాననే భ్రమలో ఉన్నాడు.. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తెస్తానని ఫెయిల్ అయినటువంటి పొలిటికల్ ఎనలిస్టు పీకే. మహా నాయకుడిని అవుదామని జన స్వరాజ్ అనే పార్టీ పెట్టారు. ఆయనకు ఉన్నటువంటి సిద్ధాంతాలను మేనిఫెస్టోతో కానీ ప్రజలలోకి పోయే పరిస్థితి బిహార్‌లో కనిపించడం లేదు. అక్కడ ప్రజలు ఒక నాయకుడుగా ప్రశాంత్ కిషోర్‌ను చూసే పరిస్థితి లేదు. ప్రజల దృష్టిని ఆయనవైపు మళ్లించేందుకు బిహార్ సెంటిమెంట్ వాడుకోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బిహార్ ప్రజలను అవమానించారని చెప్పుకు తిరుగుతున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రశాంత్ కిషోర్ ఈ కుట్రకు తెరదీశారు. ఎంత అరిచి గోల పెట్టినా ప్రశాంత్ కిషోర్‌ను ఎవరూ పట్టించుకోరు.. అతనొక ఫెయిల్డ్ పొలిటికల్ ఎనలిస్టు, ఫెయిల్డ్ పొలిటికల్ నాయకుడు’ అంత దమ్మున్నోడే ఎన్నికల్లో గెలిచి చూపించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.

Next Story