గొప్పగా ఆలోచించండి కేటీఆర్​: ఎంపీ చామల

by Yella Dhawani Reddy |

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మల్యే కేటీఆర్(MLA KTR)పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Kirankumarreddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

గొప్పగా ఆలోచించండి కేటీఆర్​: ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మల్యే కేటీఆర్(MLA KTR) భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Kirankumarreddy) ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సంకుచ మనస్తత్వంతో ఆలోచన చేయడం మానేసి, గొప్పగా ఆలోచించాలని సూచించారు. 'హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలను వేల మైళ్ల దూరం ప్రయాణించి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు తీసుకెళ్లి వాటిని పెట్టుబడులుగా ప్రకటించడమే విన్నూతమైన ఆలోచనా' అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి బుధవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెడుగా ఆలోచించే మనిషికి, ప్రతీ విషయంలోనూ చెడే కనిపిస్తుందని విమర్శించారు. కేటీఆర్​తెలంగాణ ప్రచారకర్త అని చెప్పుకుంటూనే, తెలంగాణ పురోగతిని అణగదొక్కడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, దీనిని కేటీఆర్​జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Next Story