- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓర్వలేక రోజుకు మూడు మీట్లు, నాలుగు ట్వీట్లు.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
ప్రజా ప్రభుత్వ పాలనను కేటీఆర్ (KTR) జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే రోజుకు మూడు ప్రెస్ మీట్లు, నాలుగు ట్వీట్లు పెడుతున్నారని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వ పాలనను కేటీఆర్ (KTR) జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే రోజుకు మూడు ప్రెస్ మీట్లు, నాలుగు ట్వీట్లు పెడుతున్నారని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ (Hyderabad) కి ఆర్ఆర్ఆర్ (RRR) అనేది ఒక లైఫ్ లైన్ (Life line)అని, తెలంగాణ రాష్ట్రం (Telangana State) 50 శాతం అర్బనైజేషన్ (Urbanize) అవ్వడానికి ట్రిపుల్ ఆర్ (Triple R) ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సుమారు రూ.34,367 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగిందని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులను (Union Ministers) కూడా కలిసినట్లు తెలిపారు.
ఈ ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు (Radial Roads) నిర్మించాలని తలపెట్టామని, దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ల వరకు పట్టణాలుగా మారబోతున్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో (Budget Session) దీని కోసం నిధులు రాబట్టడానికి ఎంపీలంతా కృషి చేయాలని వివరించారు. అలాగే తెలంగాణ భవిష్యత్తు కోసం కేంద్రం దగ్గర నిధులు సాధించడంలో మా కాంగ్రెస్ ఎంపీలకు (Congress Mps) ఎంత బాధ్యత ఉందో, బీజేపీ ఎంపీలకు (BJP MPs) కూడా అంతే ఉందని, కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకురావడం మన బాధ్యత అని అన్నారు. అంతేగాక పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru-Ranga Reddy project) జాతీయ హోదా (national status), విభజన హామీలు (division guarantees), ఐఐఎం (IIM).. ఇలా ఎన్నో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని, వాటి కోసం పోరాటానికి మేము సిద్ధం.. మరి బీజేపీ ఎంపీలు సిద్ధమా? అని ప్రశ్నించారు.
ఇక రాజకీయంగా విమర్శలు చేయడం తప్పు లేదని, తప్పు చేస్తే వేలెత్తి చూపేందుకే ప్రతిపక్షాలు ఉన్నాయని, తామేం బీఆర్ఎస్ మాధిరిగా ప్రతిపక్షం లేకుండా చేయడం లేదన్నారు. మనకు అందని బోజనం ఇంకేవరు తినొద్దు అనే సైకాలజీ తో కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని, రోజూ మూడు ప్రెస్ మీట్లు (Three Press Meetings), నాలుగు ట్వీట్లు (Four Tweets) పెట్టి ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చి పాలన అందిస్తుంటే.. కేటీఆర్ కు అసలు డైజెస్ట్ (Digest) కావడం లేదని, ఓర్చుకునే తత్వం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్లు (BRS Leaders) అపోజిషన్ (Opposition) లేకుండా చేసి, ప్రజలకు తెలియకుండా జీవోలు (Gos) ఇచ్చి పాలన అందించలేదని, అన్నీ వారి ముందే చేస్తూ చిత్తశుద్దితో పని చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ (Congress MP)చెప్పారు.






