- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11న “ ఛలో హైదరాబాద్” మహా ధర్నా
శాసనసభ ఎన్నికల్లో పెన్షనర్ల పూర్తి సహకారంతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం ప్రస్తుతం పెన్షనర్లను పూర్తిగా

పెన్షనర్ల సమస్యలపై
11న “ ఛలో హైదరాబాద్” మహా ధర్నా
= టీజీపీ జేఏసీ ఛైర్మన్ కే.లక్ష్మయ్య
దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభ ఎన్నికల్లో పెన్షనర్ల పూర్తి సహకారంతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం ప్రస్తుతం పెన్షనర్లను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వాన్ని, మంత్రులను కలిసి విన్నవిస్తున్న తమ సమస్యలు పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్‌కే. లక్ష్మయ్య ఆరోపించారు. సోమవారం సంఘం జనరల్సెక్రటరీ పి.కృష్ణమూర్తి, చైర్పర్సన్ఆర్. ఉమాదేవి తదితరులతో కలిసి సచివాలయం మీడియా పాయింట్వద్ద వారు మాట్లాడారు. రాష్ట్రంలో వరుస కేబినెట్సమావేశాలు జరుగుతున్నా కూడా పెన్షనర్ల సమస్యలు మాత్రం ప్రభుత్వ ప్రస్తావనకే రావడం లేదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షలకు పైగా పెన్షనర్లు తీవ్ర నిరాశ నిస్ప్రహలలకు , ఆవేదనకు లోనవుతున్నారన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టు 11న ఇందిరా పార్కు వేదికగా ‘ ఛలో హైదరాబాద్ ’ మహా ధర్నా నిర్వహిస్తామని ఛైర్మన్లక్ష్మయ్య ప్రకటించారు.
ఇప్పటికైనా ఈహెచ్ఎస్నగదు రహిత చికిత్స అందించాలని, రిటైర్డ్పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్, జీపీఎస్చెల్లించాలని, రూ.398 వేతనంతో నియమితులైన స్పెషల్‌టీచర్లకు నోషనల్ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, వివిధ శాఖలలో సేవలు అందించి రిటైర్అయిన పెన్షనర్లు అందరికీ ట్రెజరీ ద్వారా పెన్షన్చెల్లించాలని, పెన్షనర్స్డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని, సమావేశాలు, ఉత్సవాల నిర్వహణకు నూతన పెన్షనర్స్భవన్నిర్మించాలని, 1 వ పీఆర్సీ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం 20 సంవత్సరాలకే పూర్తి పెన్షన్మంజూరు చేయాలని , తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్లే , పెన్షనర్లకు కూడా ఇన్సెంటివ్ప్రకటించాలని, సీనియర్సిటిజన్లు అయిన పెన్షనర్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో 50 శాతం రాయితీ కల్పించాలని, కాంగ్రెస్మేనిఫెస్టోలో పెట్టినట్లుగా డీఏ, డీఆర్అన్ని వాయిదాలు విడుదల చేసి మంచి ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, నూతన పెన్షన్‌విధానాన్ని ఎన్పీఎస్ను రద్దు పరిచి ఓల్డ్పెన్షన్విధానం ఓపిఎస్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ నాయకులు తులసి సత్యనారాయణ, డాక్టర్అరుణ, భరత్‌రెడ్డి, రాజేంద్రబాబు, ధనలక్ష్మి, పుల్లయ్య, పెద్ది రమేష్, మోహన్నారాయణ, నరసరాజు, దేవేందర్పాల్గొన్నారు.






