నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం

by velandi.Saikiran |

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ప్రత్యేక

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ప్రత్యేక రైలులో చర్లపల్లి నుంచి నాగ్ పూర్ వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి... ట్రైన్ జర్నీ చేయనున్నారు. కార్యకర్తలతో పాటు రైలులో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయాణించబోతున్నారు.

ఈ నెల 5, 6, 7 తేదీలలో ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై తెలంగాణ పిసిసి ధర్నా చేయనుంది. ఈ మేరకు ఆగ్రా నేతలు అందరూ కదిలి వెళ్ళనున్నారు. బిజెపికి కనువిప్పు కలగాలి... చలో ఢిల్లీకి బీసీలు కదలాలి అనే నినాదంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇది ఇలా ఉండగా... అటు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ సందర్భంగా కేబినెట్ ముందుకు కాలేశ్వరం కమిషన్ నివేదిక కూడా రానుంది.

Next Story