- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సవాళ్లు.. ప్రతిసవాళ్ల హోరు.. కాసేపట్లో ప్రెస్‌క్లబ్‌కు రానున్న కేటీఆర్
వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్వీకరించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్వీకరించిన విషయం తెలిసిందే. చర్చకు సిద్ధమయ్యేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని ఆయన కామెంట్ చేశారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేల్‌లలో ఎక్కడైనా సరేనని ప్లేస్ చెబితే తాను డిబేట్‌కు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ నెల 8న (ఇవాళ) ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తాము సిద్ధంగా ఉంటామని, సీఎంకు కూడా కుర్చీ వేసి ఉంచుతామని పేర్కొన్నారు. అయితే, చెప్పినట్లుగానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajiguda Press Club)నకు వచ్చేందుకు సిద్ధమరమ్యారు. ఈ మేరకు ఆయన కాసేటి క్రితమే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రెస్ క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ప్రెస్ క్లబ్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ చేసిన సవాలుపై ప్రతి సవాళ్లు విసురుతున్నారు. మీతో చర్చకు ముఖ్యమంత్రి ఎందుకు తాము వస్తామని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తుండగా.. సీఎంతోనే చర్చిస్తానని కేటీఆర్ బదలిస్తున్నారు. మరోవైపు మంత్రులు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని అంటున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతి సవాళ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.






