భక్తులకు అలర్ట్.. పండగ పూట కీసరగుట్ట ఆలయంలో రెచ్చిపోయిన దొంగలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-15 06:51:46  IST  )

మహాశివరాత్రి సందర్భంగా కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. క్యూలైన్‌లో ఉన్న భక్తురాలి మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసు దొంగలు అపహరించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

భక్తులకు అలర్ట్..  పండగ పూట కీసరగుట్ట ఆలయంలో రెచ్చిపోయిన దొంగలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునే బిజీలో ఉంటే కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయాల్లోని క్యూలైన్‍లన్ని కిటకిటలాడుతుంటే ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో (Keesara Gutta Sri Ramalingeswara Swamy Temple) చైన్ స్నాచింగ్ (Chain Snatching) కలకలం రేపింది. క్యూలైన్‍లో స్వామివారి దర్శనానికి వెళ్తున్న ఓ భక్తురాలి మెడలో నుంచి 5 తులాల బంగారం గొలుసు చోరీకి గురైంది. గొలుసు పోయిన విషయం గ్రహించిన సదరు భక్తురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా పర్వదినం వేళ భక్తుల రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని భక్తులు అప్రమత్తతతో ఉండాలని పోలీసుసుల ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

పటిష్ట ఏర్పాట్లు..

శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయాల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, భారీ భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. గంగా ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘాను పెంచారు. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

Next Story