- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగాచి ప్రమాదంపైన సమగ్ర విచారణ జరపాలి
రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలపై భద్రతా తనిఖీలు చేయాలని సీపీఐ మాజీ ఎంఎల్ఏ చాడ వెంకటరెడ్డి డిమాండ్చేశారు. సోమవారం

అన్ని ఫ్యాక్టరీలపై సెఫ్టీ తనిఖీలు చేయాలి
== సిగాచి ప్రమాదంపైనా సమగ్ర విచారణ జరపాలి
== సీపీఐ మాజీ ఎంఎల్ఏ చాడ వెంకటరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలపై భద్రతా తనిఖీలు చేయాలని సీపీఐ మాజీ ఎంఎల్ఏ చాడ వెంకటరెడ్డి డిమాండ్చేశారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్టాడారు. సంగారెడ్డి జిల్లా కాచమైలారం వద్గ గల సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అన్నారు. సిగాచి ప్రమాదంపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది కార్మికులు మరణించడం ఘోర మైన ఘటన అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యం అధునాతనమైన పరికరాలు తీసుకు రాలేదనేది అర్థమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిశ్రమలో ఇంత మంది కార్మికులు చనిపోవడం మొదటి సారి అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ ఘటనను అనుభవంగా తీసుకొని అయిన రాష్ట్రంలోని అన్ని ఫ్యాక్టరీలపై సేఫ్టీ తనిఖీలు చేయాలన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. సిగాచి ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు సంతాపాన్ని వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.






