- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొరల తెలంగాణను ఇక సాగనంపుదాం: చాడ వెంకట్ రెడ్డి కీలక పిలుపు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చుకొని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చుకొని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన.. తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన హామీని సోనియా నిలబెట్టుకున్నదని గుర్తు చేశారు.
తెలంగాణలో గత తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పోకడలతో పరిపాలన కొనసాగించారని మండిపడ్డారు. ఉద్యమ అకాంక్షను, హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరు హస్తం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణ యువత, నిరుద్యోగులు, మేధావులు అందరు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కొత్తగుడెంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






