బ్రేకింగ్: తెలంగాణలో ముగిసిన ప్రచారం.. సీఈవో వికాస్ రాజ్ కీలక ఆదేశాలు

by Satheesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని.. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిన

బ్రేకింగ్: తెలంగాణలో ముగిసిన ప్రచారం.. సీఈవో వికాస్ రాజ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని.. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిన నేపథ్యంలో సీఈవో వికాస్ రాజ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని తెలిపారు. సినిమాలు, సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. ఈసీ నుండి అనుమతి పొందిన ప్రకటనలను ప్రింట్ మీడియాలో మాత్రమే ప్రచురించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. స్థానికేతరులు నియోజకవర్గాలను విడిచి వెళ్లానని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేదం ఉంటుందని తెలిపారు. ఓటర్ స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూదన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వియోగించుకున్నారని.. ఇప్పటి వరకు ఎన్నికల్లో విధుల్లో 1.48 లక్షల మంది ఓటు వేశారని తెలిపారు.

Next Story