- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్ బై పోల్ పై సీఈవో సుదర్శన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జూబ్లీహిల్స్ బై పోల్ పై సీఈవో సుదర్శన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నిర్వహణపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ (Telangana Assembly) నుంచి తమకు గెజిట్ అందిందని ఆ గెజిట్ ను తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పుడే రాకపోవచ్చని చెప్పారు. జూబ్లీహిల్స్ స్థానానికి డిసెంబర్ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నికల జరగాల్సి ఉందన్నారు.
ఈ నెల 26,27 న శిక్షణ:
పోలింగ్ స్టేషన్లలలో మినిమం ఓటర్ల సంఖ్యను 1200 కు కుదించినట్లు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలను 200 మీటర్ల నుంచి కిలో మీటర్ వరకు పెంచినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదని పోలింగ్ సెంటర్స్ వద్ద ఇకపై మొబైల్ ఫోన్స్ కోసం డిపాజిట్ ఫెసిటిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నెల 26,27 తేదీల్లో తెలంగాణకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ), బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) లకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇస్తోందని వివరించారు. నేషనల్ లెవల్ లీగల్ కాన్ఫరెన్స్ కోసం ముగ్గురు న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నదని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 87 శాతం, అర్బన్ ప్రాంతంలో 67 శాతం ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ జరిగిందని వివరించారు.






