ఎస్ఈసీ రాణి కుముదినితో సీఈవో సుదర్శన్ రెడ్డి భేటీ.. 100 శాతం వెబ్ కాస్టింగ్‌ అమలుపై చర్చ

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈవో రాణి కుముదనితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు.

ఎస్ఈసీ రాణి కుముదినితో సీఈవో సుదర్శన్ రెడ్డి భేటీ.. 100 శాతం వెబ్ కాస్టింగ్‌ అమలుపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈవో రాణి కుముదనితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత వినియోగంపై ప్రధానంగా చర్చించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 100 శాతం వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్న విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారా లేదా అని సీఈవో సుదర్శన్ రెడ్డి, రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు. వెబ్ కాస్టింగ్‌తో రిగ్గింగ్, దొంగ ఓట్లు వంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఎస్ఈసీ, సీఈవోల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల గణన, కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.

Next Story