- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘట్కేసర్-యాదాద్రి MMTS విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఘట్కేసర్-యాదాద్రి (రాయగిరి) 33 కి.మీ MMTS(మెట్రో రైల్) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు చేపట్టేందుకు ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు మంజూరు చేసింది.

- ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు మంజూరు
- కేంద్ర రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపిన భువనగిరి ఎంపీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఘట్కేసర్-యాదాద్రి (రాయగిరి) 33 కి.మీ MMTS(మెట్రో రైల్) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు చేపట్టేందుకు ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్రిల్ నెలలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జీరో అవర్ లో ఘట్కేసర్-యాదాద్రి (రాయగిరి) 33 కి.మీ MMTS విస్తరణకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఘట్కేసర్-యాదాద్రి (రాయగిరి) 33 కి.మీ MMTS విస్తరిస్తున్నట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే విస్తరణకు సంబంధించిన భూసేకరణ, తదితర పనులు వేగవంతం చేయడానికి సిద్ధమవుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు సమకూర్చినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు భువనగిరి ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.






