- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు: కిషన్‌రెడ్డి
రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశమయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో ప్రతిపాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విస్తృత చర్చ జరిపారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమీక్ష చేసి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తయ్యేలా నిర్ణయించారు. పరిపాలనా పరమైన, సాంకేతిక పరమైన సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయం కోసం 953 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 2500 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు, ప్రస్తుతం డిజైన్, స్కోప్ ఆఫ్ వర్క్, డీపీఆర్‌ను ఖరారు చేసే ప్రక్రియ తుదిదశలో ఉంది.
2026 జూన్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అయితే రన్‌వే నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు అధికారులు వివరించారు. విమానాశ్రయాన్ని జాయింట్యుసేజ్ విధానంలో ఉపయోగించే అంశంపై భారత ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలు.. విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమిని గుర్తించామని దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ కూడా జరుగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. తెలంగాణలో విమాన రవాణా పెంచడం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తే ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా ఈ విమానాశ్రయ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.






