- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజారుద్దీన్‌కు అందుకే మంత్రి పదవిచ్చారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి..

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ఉపఎన్నికకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కులో ఆదివారం ఉదయం వాకర్స్ తో ముచ్చటించారు. పార్కులో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజమేనా అని ప్రశ్నించారు. దేశాన్ని, సైనికులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం మంచిది కాదన్నారు.
సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు, సైనికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరమైన అవగాహన లేదని, ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు చేస్తే ఆయన స్థాయి అంతే అయ్యుండొచ్చని భావిస్తామన్నారు. ఇక అజారుద్దీన్ కు మంత్రిపదవి ఇవ్వడానికి కారణం.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడమేనన్నారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీల ప్రభావం ఉంది కాబట్టి.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవాలి కాబట్టి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి మంత్రి పదవి కేటాయించారన్నారు. మైనార్టీలపై అంత ప్రేమే ఉంటే రెండేళ్లుగా ఎందుకు మంత్రిపదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం జూబ్లీహిల్స్ ఓట్లను కొల్లగొట్టేందుకే రేవంత్ ఇలా ప్లాన్ చేశారని ఎద్దేవా చేశారు.






