హెచ్‌సీఏ సెలక్షన్లపై త్వరలో నిజనిజాలు బయటపెడతా : కేంద్రమంత్రి బండి సజయ్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్‌సీఏ సెలక్షన్లపై త్వరలో నిజనిజాలు బయటపెడతా : కేంద్రమంత్రి బండి సజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్, సీనియర్ క్రికెటర్ల సెలక్షన్ పై ఆయన సీరియస్సయ్యారు. సెలక్షన్ కమిటీ లక్షల రూపాయలను వసూలు చేస్తూ.. నైపుణ్యంలేని క్రికెటర్లను సెలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాము రాచకొండ కమిషనర్ కు సమాచారం ఇచ్చామని, త్వరలోనే బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సెలక్షన్ కమిటీ మెంబర్స్ పై యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.

టాలెంట్ ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ గోడును వెళ్ళబోసుకున్నారని, గతంలో కూడా మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్ ను సెలెక్ట్ చేయలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. హెచ్‌సీఏ సెలక్షన్లపై త్వరలో నిజనిజాలు బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story