కేంద్ర ప్రభుత్వ సెక్షన్​ అధికారుల పర్యటన

by Yella Dhawani Reddy |

కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో కొత్తగా ఎంపికైన 32 సెక్షన్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో భేటి అయ్యారు.

కేంద్ర ప్రభుత్వ సెక్షన్​ అధికారుల పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో కొత్తగా ఎంపికైన 32 సెక్షన్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో భేటి అయ్యారు. పంచాయతీరాజ్​, మున్సిపల్​ శాఖ అధికారులు భేటి అయి ఇక్కడ పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ వ్యవస్థ తీరును అధ్యయనం చేశారు. శుక్ర, శనివారాల్లో వారు రాష్ట్రంలోని రెండు శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఇక్కడి విధానాలను తెలుసుకున్నారు. వీరికి మున్సిపల్​శాఖ ప్రభుత్వ అదనపు కార్యదర్శి సిహెచ్. ప్రియాంక, అడిషనల్​సెక్రటరీ వి.సైదా, ప్రభుత్వ ఉప కార్యదర్శి, మున్సిపల్ పట్టగాభివృద్ధి శాఖ అధికారులు వారికి సమాచారాన్ని అందించారు. వారి సందేహాలను తీర్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు.

Next Story