- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Central Govt.: ప్రొబెషనరీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. కేంద్రం సంచలన ఆదేశాలు
ట్రైనింగ్ పీరియడ్‌లో నిబంధనలు అతిక్రమించిన ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌పై కేంద్రం సీరియస్ అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రైనింగ్ పీరియడ్‌లో నిబంధనలు అతిక్రమించిన ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌పై కేంద్రం సీరియస్ అయింది. సదరు ఐపీఎస్ ప్రొబెషనరీ పీరియడ్‌ను మరో రెండేళ్ల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) లేఖ రాసినట్లు తెలిసింది. కొన్ని నెలల కిందట మారుమూల ప్రాంతంలో పనిచేస్తోన్న సదరు ఐపీఎస్.. సిటీ శివారులోని ఓ భూవివాదంలో తలదూర్చారు. తాను పనిచేస్తోన్న పరిధిని దాటి పోలీసు యూనిఫాంలో ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హంగామా చేశారు. అక్కడున్న సిబ్బంది ఎంత నచ్చజెప్పేందుకు యత్నించినా వారి మాట వినలేదు. దీనితో ఈ విషయాన్ని నిఘా వర్గాలు వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఆయన తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ ఐపీఎస్‌కు చార్జిమెమో జారీ చేయడంతో పాటు ప్రొబెషనరీ టైమ్‌లో ఉన్నందున కేంద్ర హోంశాఖ పరిధిలోని డీఓపీటీ విభాగానికి (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెప్పించుకున్న డీఓపీటీ సదరు ఐపీఎస్ ప్రొబెషనరీ టైమ్‌ను మరో రెండేళ్లు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయం వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ప్రొబెషనరీ టైం పొడగించడం చాలా అరుదు..
ప్రొబెషనరీ టైమ్‌లో ఉన్న అధికారుల పనితీరు చాలా కీలకం. ఆ సమయంలో వారు వ్యవహరించే తీరుపై ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ‘రాష్ట్రంలో పని చేస్తున్న ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ పనితీరుపై వచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. ప్రొబెషనరీ టైమ్‌ను మరో రెండేళ్లకు పొడగించడం అంటే చాలా పెద్ద పనిష్మెంట్. ఇలాంటి శిక్షలు చాలా అరుదు. దీనిని చూసైనా మిగతా అధికారులు జాగ్రత్తగా ఉండాలి’ అని ఓ సీనియర్ బ్యూరోక్రాట్ వ్యాఖ్యానించారు.






