- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: యూరియా వచ్చేస్తోంది.. తెలంగాణ రైతాంగానికి కేంద్రం తీపి కబురు
గత కొన్ని రోజులకు యూరియా కోసం తిప్పలు పడుతున్న రాష్ట్ర రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana farmers) తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central government) గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులకు యూరియా కోసం తిప్పలు పడుతున్న రాష్ట్ర రైతులకు తీపి కబురు అందించింది. ఈ మేరకు యూరియా (urea) కేటాయింపునకు కేంద్రం అంగీకరించిందని మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ప్రకటించారు. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. 50 వేల మెట్రిక్ టన్నులు తక్షణ కేటాయింపునకు కేంద్రం అంగీకారం ఇచ్చిందని మంత్రి ప్రకటించారు.
కాగా, యూరియా సరఫరాపై ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీల ఆందోళన ఫలితంగా కేటాయింపునకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపిస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ రైతాంగం హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సభలో ఈ సమస్యపై మాట్లాడుతామని స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్ర రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణమే తెలంగాణకు 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని నిన్న కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.






