ఈ నెల 10వ తేదీవ వరకు మిషన్ సంపూర్ణ కేవైసీ 2026

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-06 14:33:12  IST  )

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్, రీజినల్ కార్యాలయం మిషన్ సంపూర్ణ కేవైసీ –2026 దేశవ్యాప్తంగా సీ-కేవైసీ, రీ కేవైసీ ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తోంది.

ఈ నెల 10వ తేదీవ వరకు మిషన్ సంపూర్ణ కేవైసీ 2026
X
  • సెంట్రల్​బ్యాంక్​ఆఫ్​ఇండియా వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ , రీజినల్ కార్యాలయం మిషన్ సంపూర్ణ కేవైసీ –2026 దేశవ్యాప్తంగా సీ-కేవైసీ, రీ కేవైసీ ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహిస్తోంది. సోమవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వేగవంతం చేయడం, ఖాతాదారుల్లో అవగాహన పెంపొందించడం, నియంత్రణ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఆర్​బీఐ ఇండియా అస్టిసెంట్​మేనేజర్​హేమల్ట జీ. పరంజపీ తెలిపారు. మిషన్​కేవైసీ తాము సూచించిన గడువులో 100 శాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవను అభినందించారు. ఈ సందర్భంగా సీ-కేవైసీ, రీ కేవైసీ సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు, అమలు విధానాలు, ఉత్తమ పద్ధతులు పూర్తి అంశాలను విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏవీ రమణ మూర్తి, డిప్యూటీ జోనల్ హెడ గజేంద్ర సింగ్​చౌహాన్, రీజినల్ హెడ్ కనక రాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు, శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story