Central Bank: సెంట్రల్ బ్యాంక్ అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్‌రిచ్ ప్రచారం

by Ramesh Naini |

కడప రీజియన్ వేమూరు గ్రామంలో అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్‌రిచ్ ప్రచారాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు శుక్రవారం నిర్వహించారు.

Central Bank: సెంట్రల్ బ్యాంక్ అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్‌రిచ్ ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కడప రీజియన్ వేమూరు గ్రామంలో అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్‌రిచ్ ప్రచారాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రూ. 25 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను పంపిణీ చేసినట్లు రిజినల్ హెడ్ పేర్కొన్నారు. కడప రీజియన్ పరిధిలోని అన్ని ఇతర శాఖలలో ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరు లేఖలను, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ యోజన క్లెయిమ్ సెటిల్‌మెంట్ చెక్కులను చట్టబద్ధమైన వారసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి. రవికుమార్, ఎంఏఓ ప్రేమ్‌సాగర్; వేమూరు ఏపీఎం కె. శోభన్, ఆర్‌ఓ చీఫ్ మేనేజర్ బి. కె. ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ జ్ఞాన సౌందరి, వేమూరు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story