- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధుల డైవర్షన్‍పై కేంద్రం సీరియస్ నిఘా: బండి సంజయ్
గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రం నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం నుంచి మంజూరైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు డైవర్షన్ (Central Funds diversion) చేయడంపై కేంద్ర ప్రభుత్వ శాఖలు సీరియస్ గా నిఘా పెట్టాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. రాష్ట్రంలో నిధుల డైవర్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిధులు మళ్లించిందని ఆరోపించారు. ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాల దిశా(డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) మీటింగ్‍లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిధుల మళ్లింపుల విషయంలో అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటోందన్నారు. అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళుగా భావించాలని, ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం పథకాలను ప్రజల కోసం తీసుకువస్తాయని వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అధికారులు కష్టపడితేనే పథకాలు విజయవతం అవుతాయన్నారు. నాయకుల కోసం, పోస్టింగ్, ప్రమోషన్ల కోసం అధికారులు పని చేస్తే అభివృద్ధి జరగదన్నారు. తాను ఎంపీ అయ్యాక కరీంనగర్ కు అనేక కేంద్ర పథకాల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్యార్థినులకు సైకిళ్లు అందజేశామన్నారు.






