- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీశ్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
తెలుగు బిడ్డ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) చైర్మన్ జి.సతీశ్ రెడ్డి (G. Sathish Reddy) మరో అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిడ్డ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) చైర్మన్ జి.సతీశ్ రెడ్డి (G. Sathish Reddy) మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ భద్రతా సలహా మండలి (National Security Advisory Council)లో సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ (Central Defense Department) విభాగం నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల పాటు సతీశ్ రెడ్డి జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నెల్లూరు (Nellore) జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సతీశ్ రెడ్డి జన్మించారు. అదే ప్రాంతంలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు.
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. అదేవిధంగా హైదరాబాద్ (Hyderabad)లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి MS అండ్ PhD పట్టా పొందారు. 1986లో సతీశ్ రెడ్డి హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL)లో చేరారు. అనంతరం రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ఏర్పడిన తర్వాత దానిలో చేరారు. RCIలో డైరెక్టర్‌గా, IR సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభివృద్ధికి సతీశ్ రెడ్డి నాయకత్వం వహించారు. మొదట నావిగేషన్ సైంటిస్ట్‌గా సిస్టమ్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన చివరికి సెప్టెంబర్ 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా పదోన్నతి పొందారు. మే 2015లో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమితులయ్యారు.
ఆగస్టు 2018లో ఆయన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి శాఖ కార్యదర్శిగా, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) చైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇండియన్ బాలిస్టిక్ క్షిపణి డిఫెన్స్ ప్రోగ్రాం, నాగ్ , QRSAM , రుద్రం , లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్ మొదలైన క్షిపణి వ్యవస్థల అభివృద్ధిని పర్యవేక్షించారు. ఇండియా మొట్టమొదటి విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మార్క్-2 యాంటీ-శాటిలైట్ (ASAT) క్షిపణి ( మిషన్ శక్తి ) పరీక్షను కూడా పర్యవేక్షించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన-శ్రేణి తుపాకీ ATAGS, యాంటీ-రేడియేషన్ క్షిపణులు, స్మార్ట్ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాలు, స్మార్ట్ బాంబులు, క్షిపణి సహాయక టార్పెడో విడుదల వ్యవస్థల అభివృద్ధిలో సతీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.






