- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి నిర్వీర్యం చేస్తారా?: పొన్నం ప్రభాకర్
గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందని పొన్నం విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని (MGNREGA) విస్తరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై భారం మోపేలా కొత్త చట్టంలో 60:40 శాతం నిధుల నిబంధన పెట్టారని, కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. ఇవాళ హైదరాబాద్‍లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Congress 141st Foundation Day) జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఇందుకు నిరసనగా రేపు ప్రతి గ్రామంలో గాంధీ, ఫోటోలతో పని చేస్తూ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా చేసిన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. బీజేపీ నిర్ణయాన్ని నిరసిస్తూ తీర్మానం చేసి మోడీకి పంపాలన్నారు. కాంగ్రెస్ ప్రధానులు తెచ్చిన సంస్కరణల వల్లే దేశం ముందుందని, గాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం స్ఫూర్తిగా నరేగాను యూపీఏ ప్రభుత్వం తెచ్చిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకే ఎంజీ నరేగా తీసుకువస్తే మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించి జీరాంజీ అనే పేరు పెట్టారని విమర్శించారు. గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.






