- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణన పకడ్బందీగా జరిగేలా చూడాలి : అదనపు కమిషనర్ చంద్రకళ
జీహెచ్ఎంసీ పరిధిలో జనగణన పకడ్బందీగా జరిగేలా చూడాలని అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జనాభా గణన-2027 లో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ అన్నారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జీహెచ్ఎంసీ పరిధిలోనీ సెన్సెస్ -2027 సర్వే పై 60 సర్కిల్ ల పరిధిలో ఛార్జీ క్లర్క్ లుగా నియామకమైన- జూనియర్ అసిస్టెంట్ లు, సీనియర్ అసిస్టెంట్ లు, పర్యవేక్షకుల కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ సెన్సెస్ -2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు. మొదటి దశ పగడ్బందీగా నిర్వహిస్తే రెండో విడత సజావుగా జరుగుతుందన్నారు. జనాభా గణన-2027 నియమ, నిబంధనల పై పూర్తి అవగాహన పెంపొందించుకొని సెన్సెస్ -2027 పక్కగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.






