- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణన నమోదు చాలా సులువు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా ప్రతి ఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈనెలలో ప్రారంభమైన జనగణనలో భాగంగా తొలిదశలో హౌజ్ లిస్టింగ్ (ఇంటి వివరాలు), హౌజింగ్ సెన్సెస్ (ఇంట్లోని సౌకర్యాల) వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అందు కోసం https://se.census.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. బుధవారం డిల్లీలోని తన నివాసంలో జాతీయ రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణాంకాల కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ దీరజ్ జైన్ తోపాటు ఆ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. జనగణనలో భాగంగా తొలిదశలో చేపడుతున్న హౌజ్ లిస్ట్, హౌజింగ్ సెన్సెస్ వివరాలను వివరించారు.
తొలిదశలో లోకేషన్ డిటైల్స్, ఒక కుటుంబం ఉండే ఇల్లు, ఆఫీస్, సౌకర్యాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనుండే స్వీయ ఎన్యుమరేషన్ ను నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వెంటనే ఆయన డిజిటల్ విధానంలో సొంతంగా తన ఇల్లు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించడం శుభపరిణామమని, భారత అభివృద్ధిని మరింత వేగవంతం చేసి, వికసిత భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ మహత్తర జాతీయ కార్యక్రమాన్ని కాగితాలతో పనిలేకుండా డిజిటల్ సాధనాలతో నిర్వహించడం, పౌరులకు స్వీయ-ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించామన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను సమర్పించేందుకు ముందుకు వస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ అధికారిక పోర్టల్ https://se.census.gov.in ను సందర్శించి స్వీయ-ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.






