- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Census: ఈ ఏడాది జనగణన లేనట్లేనా? బడ్జెట్ లో కేటాయింపులతో అనుమానాలు!
ఈ ఏడాదైనా జరుగుతుందని భావిస్తున్న జనగణనపై కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన (Census) ఈ ఏడాది కూడా లేనట్లేనా? తాజాగా బడ్జెట్ కేటాయింపులు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ (union budget 2025) కేటాయింపుల్లో జనగణనకు రూ.574.80 కోట్లే కేటాయింపులు చేశారు. అయితే 2021 లో జన గణన, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) అప్ డేట్ కోసం 2019లోనే కేంద్ర కేబినెట్ రూ. 8,754 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ ఏడాది జనగణను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగినా ఈఏడాది బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు 2019 నాటి ప్రతిపాదనల కంటే తక్కువ కేటాయించడంతో ఈసారైనా జనగణన జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదేళ్లకోసారి సేకరించే దేశ జనాభా లెక్కలు 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక అంశాలు ముందడుగు పడాలంటే జనాభా లెక్కలు కీలకాంశంగా కానున్నది. ఈ నేఫథ్యంలో సెన్సస్ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.






