Jupally: ఈసారి సంక్రాంతికి కొత్తగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్: మంత్రి జూపల్లి

by Prasad Jukanti |

సంక్రాంతి వేడుకలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు.

Jupally: ఈసారి సంక్రాంతికి కొత్తగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్: మంత్రి జూపల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గ్లోబల్ టూరిజం హబ్‍గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి యేటా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ఈసారి జనవరి 13-15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (Kite and Sweet Festival) నిర్వహించబోతున్నామని, జనవరి 13-14 తేదీల్లో గచ్చిబౌలిలో డ్రోన్ షో (Drone Show) నిర్వహిచబోతున్నామని చెప్పారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కైట్ ఫెస్టివల్‍లో 19 దేశాలకు చెందిన 40 మంది పాల్గొంటారని, డ్రోన్ షో లో భాగంగా అత్యాధునిక ఎల్‍ఈడీ డ్రోన్లతో గగనతల విన్యాసాలు ఉంటాయని, తెలంగాణ పర్యాటక ప్రాంతాల డిజిటల్ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon Festival) ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ఈ ఈవెంట్స్ కు అందరూ రావాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండగలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించామన్నారు.

ప్రపంచ దేశాలను ఆకర్షించాలి:

పర్యాటక రంగంలో తెలంగాణ వెనుకబడి ఉందని రాష్ట్రంలో కనీస అవసరాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని మంత్రి చెప్పారు. టూరిజంలో ప్రపంచ దేశాలను ఆకర్షించాలన్నారు. పెట్టుబడులు ఆకర్షించి వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యాటక, మెడికల్, ఎకో, టెంపుల్, టూరిజంలో పెట్టుబడుల ఆకర్షిస్తామని చెప్పారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రకృతి సంపదను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపై ఆధారపడ్డాయని తెలంగాణ మాత్రం అడుగున ఉన్నామన్నారు. రాష్ట్రంలో గొప్ప గొప్ప కట్టడాలను పర్యాటకులకు తెలియజేయాలని

Next Story