పత్తి రైతులకు అలర్ట్.. ఈ నెల 21 నుంచి షురూ

by Prasad Jukanti |   (  Updated:2025-10-04 12:42:29  IST  )

పత్తి పంట కొనుగోలి విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది.

పత్తి రైతులకు అలర్ట్.. ఈ నెల 21 నుంచి షురూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై (Cotton Procurement) రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodandareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇవాళ సీసీఐ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. పత్తిపంట అమ్మకంలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని అన్నారు. గతేడాది పత్తి కొనుగోలులో జరిగిన లోపాల గురించి సీసీఐ అధికారులకు వివరించిన కోదండరెడ్డి..సీసీఐ కొనుగోళ్లలో దళారులు ప్రవేశించకుండా చూడాలని కోరారు. రైతులెవరూ తొందరపడి తమ పత్తి పంటను అమ్ముకోవద్దని ఈ నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుందని తెలిపారు.

కాగా రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో రైతులకు మద్దతు ధరలు దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో తమ పత్తి పంట అమ్ముకోవాలనుకునే రైతులు వ్యాపారులు, దళారులే దిక్కుగా మారారు. ఈ నేపథ్యంలో సీసీఐ అధికారులతో మాట్లాడిన కోదండరెడ్డి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సీసీఐ నిబంధన ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉండే పత్తిని కొనుగోళ్లకు అనుమతివ్వరు. అయితే ఇది గతంలో 16 శాతం వరకు అనుమతి ఉండేది.

Next Story