- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు ప్రచారాలపై స్పష్టతనిచ్చిన సీబీఎస్ఈ బోర్డు
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మోద్దని, పదో తరగతి, ప్లస్ 2 తరగతులకు యథావిధిగా బోర్డు పరీక్షలు జరుగుతాయని, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మోద్దని, పదో తరగతి, ప్లస్ 2 తరగతులకు యథావిధిగా బోర్డు పరీక్షలు జరుగుతాయని, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పరీక్షలు సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. కొన్ని అసాంఘీక శక్తులు యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ లాంటి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఇతర ప్లాట్ ఫారమ్ లలో 2025 పరీక్ష ప్రశ్నా పత్రాలు లీకైనట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు బోర్డు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వాదనల్లో వాస్తవం లేదని, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసర భయాందోళనలను సృష్టించడానికి కొందరు ఆకతాయిలు చేస్తున్న ప్రచారమని తెలిపింది. ఇది పరీక్షల సమయం అని తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఇలాంటి అవాస్తవాలను నమ్మోద్దని సీబీఎస్ ఈ బోర్డు తెలిపింది. ఇది పరీక్షా ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుందని వెల్లడించింది. ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే ఖచ్చితమైన సమాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్లను మాత్రమే చూడాలని తెలిపింది. సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు www.cbse.gov.in. సందర్శించాలని కోరింది. ఈ అసాంఘీక కార్యాలపాలకు పాల్పడే వ్యక్తులు, ఇతరులు ఎవరైనా సీబీఎస్ఈ బోర్డు బీఎన్ ఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.






