Kaleshwaram: కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ షురూ.. బీఆర్ఎస్‍కు మరో టెన్షన్!

by Prasad Jukanti |   (  Updated:2025-09-25 07:25:45  IST  )

Kaleshwaram: కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ షురూ.. బీఆర్ఎస్‍కు మరో టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణను (CBI Preliminary Inquiry) ఇవాళ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సీబీఐని కోరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తోంది. కేసుకు విచారణ అర్హత ఉందో తేల్చేందుకు సీబీఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలను అధికారులు పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

బీఆర్ఎస్‌కు కొత్త కష్టాలు:

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం బీఆర్ఎస్‌కు కొత్త కష్టాలు తప్పవా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం పాపం అంతా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ప్రభుత్వానికి నివేదించింది. బ్యారేజీల కుంగుబాటు, రాష్ట్ర ఖజానాకు నష్టం కలగడంలో కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణం అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్‌ను సీబీఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్‌ నెలకొంది.

Next Story