కాళేశ్వరంపై సీబీఐ‌తో దర్యాప్తు జరిపించాలి.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-06 07:10:50  IST  )

రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై నమ్మకం పోయిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు.

కాళేశ్వరంపై సీబీఐ‌తో దర్యాప్తు జరిపించాలి.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై నమ్మకం పోయిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఇవాళ అసిఫాబాద్‌ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ (BJP) చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వివిధ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని కామెంట్ చేశారు. ఎప్పటికైనా డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యమని అన్నారు.

బీజేపీలో చేరాలనుకునే నేతలకు తాను ఓపెన్‌గా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో పక్కా అవినీతి జరిగిందని తెలిపారు. అందులో కేసీఆర్ (KCR) ఫ్యామిలీ పాత్ర ఉందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ఓ ఏటీఎంలా మారిపోయిందని ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడిన మాజీ సీఎంతో పాటు మంత్రులకు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

Next Story