మంథనిలో సీబీఐ విచారణ

by Elthuri vijay kumar |

అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది.

మంథనిలో సీబీఐ విచారణ
X

మంథనిలో సీబీఐ విచారణ

అడ్వకేట్ దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన బృందం..

వామన్ రావు తండ్రి నుంచి వివరాల సేకరణ

దిశ, మంథని : అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు, వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సీబీఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ బృందం పరిశీలించింది. మంథనికి సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని రాష్టం, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Next Story